బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్ వైట్ అవుట్ ఫిట్‌లో మెరిసిపోతూ కనిపించారు. ఈ మధ్య కాలంలో ఆవిడ చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం ‘RK/Rkay’ అనే సినిమాలో ఆవిడ కనిపించారు. ఐదేళ్ల తర్వాత ఆవిడ నటించిన సినిమా ఇదే. 2002లో ఆవిడ బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. 2004లో వచ్చిన ‘మర్డర్’ సినిమాతో తనకు ఫేమ్ వచ్చింది. జాకీ చాన్ నటించిన ‘ది మిత్’ అనే చైనీస్ సినిమాలో కూడా మల్లిక కనిపించారు. 2008లో వచ్చిన దశావతారం సినిమాతో తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చారు.