పచ్చి మాంసం ఫ్రిజ్‌లో ఫ్రెష్‌గా ఉంచేందుకు చిట్కాలు ఇవిగో
మాంసాహారాన్ని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అనారోగ్యాన్ని కలుగచేస్తాయి.
మాంసం తాజాగా ఉండేలా ఫ్రిజ్‌లో నిల్వ చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి.
గోరువెచ్చని నీటిలో పచ్చిమాంసాన్ని చిటికెడు పసుపు లేదా ఉప్పు వేసి అందులో ఈ మాంసాన్ని వేసి కాసేపు ఉంచాలి.
నీట్లోంచి తీసి వేశాక దాన్ని టిష్యూ పేపర్ తో లేదా టవల్ తో తుడిచేయాలి.
మాంసం తడి లేకుండా ఆరిపోయిన తరువాత గాలి చొరబడని కంటైనర్లలో వేసి మూత పెట్టాలి.
ఈ విధంగా తాజా మాంసాన్ని వారం రోజులకు పైబడి రిఫ్రిజిరేటర్లో భద్రపరచవచ్చు.
దీన్ని వండడానికి కేవలం 30 నిమిషాల ముందు ఫ్రిజ్‌లో నుంచి మాత్రమే తీసి బయటపెట్టాలి.