ఈ ఆలయంలో మట్టి ప్రసాదం చాలా సమస్యలకు చెక్ పెట్టేస్తుంది
కర్ణాటకలో కుక్కే సుబ్రమణ్యస్వామి దేవాలయానికి ఎప్పుడైనా వెళ్లారా. ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి పట్టణంలో ఉండే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మీక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదంగా అందిస్తారు.
మృత్తికా ప్రసాదాన్ని ధరించినవారికి నాగుల భయం, నాగదోషం తొలగి నాగదేవతల అనుగ్రహం ఉంటుంది
కొందరికి నిత్యం కలలో పాములు కనిపిస్తుంటాయి. ఎన్నిచేసినా ఆ భయం అలాగే ఉండిపోతుంది. అలాంటివారు ఈ ఆలయంలో మృత్తికా ప్రసాధాన్ని ధరిస్తే ఆ భయం తొలగిపోతుంది.
కొందరికి రకరకాల దోషాల వల్ల వివాహం జరగదు. అలాంటి వారు సుబ్రమణ్య స్వామిని ధ్యానించి ఒక చిటికెడు మృత్తికను, కొంచెం పసుపును నీటిలో వేసుకుని స్నానమాచరించి..దేవుడికి నేతితో దీపాన్ని వెలిగిస్తే త్వరగా వివాహం జరుగుతుంది.
ఊరికే వసపిట్టలా వాగుతుంటారు కొందరు..పుట్టుకతో వచ్చిన లక్షణమో ఏమో ఎంత కంట్రోల్ చేసినా వారి మాటలు ఆపడం ఎవ్వరి వల్లా కాదు. ఓ చిటికెడు మృత్తికను కొబ్బరినూనెలో వేసి తలకు రాసుకుంటే అతిగా మాట్లాడటం తగ్గుతుందట.
పిల్లలు చాలామంది పళ్లు కొరకడం, చీటికి మాటికీ కిందపడి కొట్టుకోవడం, అలాగే ఓ వైపు చూస్తుండిపోవడం, అదే పనిగా ఏడుస్తుండడం, ఎంత తింటున్నా సన్నబడడం లాంటి లక్షణాలుంటే సుబ్రమణ్యస్వామిని మృత్తికను బొట్టుగా పెడితే ఆరోగ్యంగా ఎదుగుతారట.
రుతుక్రమం సమయంలో కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న వారు... రుతుక్రమం వచ్చేముందు చిటికెడు మృత్తికను పొడిచేసి కొబ్బరినూనె లేదా ఆముదంలో వేసుకుని పొడిచేసుకుని పొట్టపై రాసుకుంటే ఆ నొప్పి తగ్గుతుంది.
కష్టపడి చదివినా మరిచిపోయే విద్యార్థులు కూడా చిటికెడు ముత్తికను నైట్ మొత్తం గ్లాసు వాటర్లో నానబెట్టి ఉదయాన్నే తాగితే మరుపు తగ్గుతుంది.
సంతాన భాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజ చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టిన పాలలో ఒక చిటికెడు మృత్తికాను వేసి దేవునికి చూపించిప్రార్ధన చేసుకొని తాగితే స్వామివారి అనుగ్రహం ఉంటుందంటారు.
చర్మం పొడిబారి నాగఫణి రోగాన్ని అనుభవించేవారు, నీరసంతో ఇబ్బందిపడేవారు సుబ్రమణ్యస్వామి చిటికెడు మృత్తికను నీటిలో వేసి సాయంకాలం వేళ స్నానం చేస్తే ఆ ప్రభావం తగ్గుతుందట.
నోట్: కొందరు పండితులు, కొన్ని బుక్స్, స్థానికంగా ప్రచారంలో ఉండే విషయాల ఆధారంగా రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలో పూర్తిగా మీ వ్యక్తిగతం. (Images Credit: Pinterest)