దానిమ్మ రసంతో అధిక రక్తపోటు అదుపులో అధికరక్తపోటుతో బాధపడుతున్న వారికి శుభవార్త చెప్పారు పరిశోధకులు. అధిక రక్తపోటు ఉన్న వారు రోజూకో అరగ్లాసు దానిమ్మ రసం తాగితే మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వారు చేసిన అధ్యయనంలో దానిమ్మ రసం నిత్యం తాగే వారిలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతున్నట్టు తేలింది. దానిమ్మరసం ధమనులలోని కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దానిమ్మ రసానికి చక్కెరను జోడించకుండా తింటేనే మంచి ఫలితం వస్తుంది. చక్కెర వేస్తే సమస్య పెరిగిపోతుంది. అధిక రక్తపోటు ఉన్నరు చక్కెర కలిపిన జ్యూస్ లను తాగడం తగ్గించాలి. మిగతా పండ్ల రసాలతో పోలిస్తే దానిమ్మ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్య ఉన్న వారు రోజూ దానిమ్మ పండు తింటే ఎంతో మేలు. ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది.