మే 26 గురువారం రాశిఫలాలు



మేషం
ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. తలపెట్టిన పనిలో ఆటంకాలు ఉంటాయి. ఉద్యోగం మారాలి అనుకునేవారికి ఇదే మంచిసమయం. . సహోద్యోగుల కారణంగా మీరు చికాకుగా ఉంటారు. కొన్ని నిందలు ఎదుర్కోక తప్పదు. టెన్షన్ ఉంటుంది.



వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు. మీ ప్రతిష్ట పెరుగుతుంది. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిలిచిపోయిన పనులు మిత్రుల సహకారంతో ముందుకు సాగుతాయి.సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని ముఖ్యమైన సమాచారం అందుతుంది.



మిథునం
ప్రభుత్వ కార్యాలయంలో ఎవరితోనైనా వాగ్వివాదం జరుగుతుంది. మీ పనిపై ప్రభావం పడుతుంది. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అలసట కారణంగా ఏపనీ చేయాలని అనిపించదు. తొందరపాటు వల్ల పొరపాట్లు చేస్తారు.



కర్కాటకం
ఈ రోజు ఎవరైనా మీబలహీతను ఉపయోగించుకుని పైకి ఎదిగేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. సంసార జీవితం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వివాదం ఉంటుంది. కార్యాలయ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.



సింహం
ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం జరగొచ్చు. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోండి. వాహనం చెడిపోవడంతో కాస్త ఇబ్బంది పడతారు. మానసికంగా గందరగోళానికి గురవుతారు.



కన్య
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. భౌతిక సౌకర్యాల సమీకరణకు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో ట్యాక్స్ కి సంబంధించిన సమస్యలుంటే తొలగిపోతాయి



తులా
సీజనల్ వ్యాధుల బారిన పడతారు. కొత్త పథకాలను సద్వినియోగం చేసుకుంటారు. సొంత ప్రయోజనాలకోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. స్వార్థపరుల పట్ల జాగ్రత్త వహించండి. మీ తెలివితేటల్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.



వృశ్చికం
ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. అనుభవం లేని పనిలో ఇన్వాల్స్ అవడం వల్ల కొన్ని పనులు అసంపూర్తిగా ఉండిపోతాయి.



ధనుస్సు
తల్లిదండ్రుల విషయాల్లో మీరు గందరగోళానికి గురవుతారు. జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించలేరు. వ్యాపారంలో భాగస్వాముల గురించి ఆందోళన చెందుతారు. శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. న్యాయపరమైన విషయాల్లో నష్టం జరగవచ్చు.



మకరం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపార పర్యటన ఉంటుంది. నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాల కోసం ప్రయత్నించాలి. ప్రత్యేక సబ్జెక్టుల అధ్యయనంపై ఆసక్తి చూపుతారు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.



కుంభం
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీ జీవిత భాగస్వామి సలహాను అనుసరించి ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సంబంధిత పనుల్లో విజయం సాధిస్తారు. ప్రేమికులు ఒత్తిడికి లోనవుతారు.



మీనం
మితిమీరిన పని వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేరు. వ్యాపారంలో లాభాలొస్తాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మంచి వ్యక్తులతో పరిచయాన్ని సంతోషిస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రాజకీయాల్లో ఉన్నవారిని పెద్ద పదవి వరిస్తుంది.