తెలుగులోనూ దుమ్మురేపిన బాలీవుడ్ చిత్రాలు, వీటిలోని కొన్ని సినిమాలు డబ్ చేయకుండానే ఆడేశాయ్! ప్రేమపావురాలు (1989). దీన్ని తెలుగులోకి అనువాదించి రిలీజ్ చేశారు. ప్రేమించి పెళ్లాడుతా (1995). ఈ సినిమా కూడా తెలుగులోకి డబ్ అయ్యింది. ఖల్ నాయక్ (1993). ఈ సినిమా నేరుగా హిందీలో విడుదలై సక్సెస్ అయ్యింది. కోయి మిల్‌గయా(2003). ఈ సినిమా డబ్ కాకుండానే మంచి కలెక్షన్లు సాధించింది. ఖుదాగవా(1992). ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. క్రిష్(2006). ఈ సినిమా తెలుగులో మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. కహోనా ప్యార్ హై (2000). ఈ చిత్రానికి యూత్ నుంచి మాంచి క్రేజ్ లభించింది. డర్(1993). షారుక్ నటించిన ఈ చిత్రం కూడా దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది. అమీర్ ఖాన్ నటించిన లగాన్(2001), 3 ఇడియెట్స్(2009), రంగ్‌దే బసంతి(2006), పీకే (2014) సూపర్ హిట్స్. ఇవికాకుండా అమితాబ్ ‘డాన్’, ‘హమ్’, ‘షోలే’, షారుక్ ‘దిల్ తో పాగల్ హై’, ‘కల్ హో నహో’ కూడా హిట్ కొట్టాయ్. ‘హౌస్ ఫుల్’, ‘గోల్ మాల్’, ‘దంగల్’, రంగీల, ‘బజరంగి భాయిజాన్’ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి.