ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో ఆగస్టు 5, 6 తేదీల వరకు వర్షాలు

దక్షిణ బంగాళాఖాతం నుంచి 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి

తెలంగాణలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో ఐదు రోజులు వర్షాలు

యాదాద్రి భువనగరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావం ఉత్తర కోస్తాంధ్ర, యానాంపై అధికంగా ఉంది

ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు

తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలలో తేలికపాటి జల్లులు పడతాయి

కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, పిడుగుల సూచన

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి జల్లులు

భారీ వర్షాల సమయంలో వాగులు, వంకల ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.