చలికాలంలో గుండె జాగ్రత్త



గుండెకు అతి వేడి, అత్యంత చల్లదనం కూడా హానిచేస్తుంది. కాబట్టి గుండెకు ప్రత్యేక రక్షణ అవసరం.



చలి మెల్లగా పెరగడం మొదలైంది. కాబట్టి గుండెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది.



వాతావరణంలోని సడెన్ మార్పులు శరీరంలోని హార్మోన్ల పై ఆ ప్రభావం పడుతుంది. కొన్ని హార్మోన్ల స్థాయిలు హఠాత్తుగా పెరగడం జరుగుతుంది.



హార్మోన్లలో ఇలా మార్పులు రావడంవల్ల రక్తనాళాల్లోని కొవ్వులు పగిలి రక్త ప్రవాహానికి అడ్డురావచ్చు. దీని వల్ల గుండె పోటు వస్తుంది.



గుండె జబ్బులు బారిన పడినవారు యాభై ఏళ్లు దాటిన వారు చలికి వణకడం మంచిది కాదు.



ఇలా వణకడం వల్ల హార్మోన్లలో హెచ్చుతగ్గులు వస్తాయి. కొవ్వు నిల్వల వల్ల రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుంది.



చలి ప్రారంభమవడానికి ముందే స్వెట్టర్లు లేదా దుప్పట్లు కప్పుకోవడం మంచిది. ఆస్తమా, శ్వాస కోశ సమస్యలతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.



ఊపిరితిత్తుల్లోకి సరిపడినంత గాలి చేరకపోతే గుండె మీద ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.