మీ చెయ్యి ఇలా అవుతోందా? హార్ట్ ఎటాక్ కావచ్చు కరోనా తర్వాత హార్ట్ ఎటాక్ కేసులు పెరిగాయి. కాబట్టి, ఈ లక్షణాలను ముందే పసిగట్టి అప్రమత్తంగా ఉండండి. గుండె నొప్పికి ముందు ఛాతి నొప్పిలో లేదా అసౌకర్యం ఉంటుంది. శ్వాస ఆడదు, చమట చల్లగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఎడమ చేయి నొప్పి లేదా లాగుతున్నట్లుగా అనిపిస్తే అస్సలు అశ్రద్ధ వద్దు. కొందరికి రెండు చేతులు, భుజాలు కూడా నొప్పిగా, అసౌకర్యంగా ఉంటాయి. నొప్పికి ముందు నీరసంగా అనిపిస్తుంది. తల తిరిగి సొమ్మసిల్లిపోయే అవకాశం కూడా ఉంది. ఛాతి మధ్యలో లేదా ఎడమ వైపు అసౌకర్యంగా ఉంటుంది. అది ఎక్కువసేపు కొనసాగితే ప్రమాదమే. మెడ, దవడ లేదా వెనుక భాగంలో నొప్పిగా ఉంటుంది. కొందరిలో వికారం లేదా వాంతులు ఏర్పడవచ్చు. ఛాతి మొత్తం పట్టేసినట్లుగా అసౌకర్యంగా ఉంటుంది. మూర్ఛ వచ్చినట్లుగా అనిపిస్తుంది. All Images Credit: Pexels