పచ్చి కొబ్బరి నుంచి పాలు వేరు చేయగా మిగిలిన కొబ్బరి కోరును ఎండబెట్టి వేయించి తయారు చేసే పిండే కొబ్బరి పిండి.

దీనిని గోధుమ పిండికి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు.

ఇది చాలా ఆరోగ్యవంతమైన పిండి. దీనితో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గ్లుటేన్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న వారికి, మధుమేహులకు ఇది ఆరోగ్యకరం.

సిలియాక్ డిసీజ్ ఉన్నవారికి, గ్లుటేన్ అలర్జీ ఉన్న వారు ఎలాంటి సమస్య లేకుండా తినొచ్చు

తక్కువ కార్బొహైడ్రేట్లు ఉండడం వల్ల బరువు తగ్గాలని అనుకునే వారికి గోధుమ, బియ్యం వంటి వాటికి మంచి ప్రత్యామ్నాయం.

కొబ్బరి పిండిలో ఫైబర్ ఎక్కువ. కోలన్ క్యాన్సర్ నివారణకు దోహదం చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

బ్లడ్ షుగర్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.

Representational Image : Pexels