పడుకునే ముందు ఇలా చేస్తే.. మలబద్దకం ఇట్టే మాయం! గ్యాస్, జీర్ణ సమస్యలు మలబద్దకానికి దారితీస్తాయి. కొన్ని హోమ్ రెమిడీస్ తో మలబద్దకం, గ్యాస్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాత్రిపూట గ్లాసు పాలలో టీస్పూన్ నెయ్యి కలుపుకుని తాగితే పొద్దున్నే కడుపు క్లియర్ అవుతుంది. పడుకునే ముందు గ్లాసు నీళ్లలో నిమ్మరసం పిండి తాగితే గ్యాస్ సమస్య మాయం అవుతుంది. పరగడుపున టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తాగితే మలం బద్దకం తగ్గిపోతుంది. కప్పు నీటిలో అల్లం రసం కలిపి తాగితే గ్యాస్ సమస్యలు, మలబద్దం మాయం అవుతుంది. గ్యాస్ సమస్య తగ్గాలంటే పైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆపిల్‌తో పాటు జామ పండ్లను తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com