సీజనల్ వ్యాధుల బారిన పడొద్దంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలతో సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. బయటకు వెళ్లినప్పుడు వీలైనంత వరకు మాస్క్ ధరించాలి. ఫ్లూ సోకిన వారి నుంచి వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించాలి. చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనంత వరకు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎప్పటికప్పుడు వండిన వేడి వేడి పోషకాహారం మాత్రమే తీసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు రాత్రిపూట బయటకు వెళ్లకూడదు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com