నిమ్మకాయ అసిడిటీని కంట్రోల్ చేస్తుందా? ఈ రోజుల్లో కామన్ గా వేధించే సమస్య అసిడిటీ. జీర్ణాశయంలోని యాసిడ్స్ అన్నవాహికలోకి రావడం వల్ల ఛాతి, గొంతులో మంట ఏర్పడుతుంది. అసిడిటీని కంట్రోల్ చేయడంలో నిమ్మకాయలు కీలకపాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. నిమ్మరసం జీర్ణాశయంలో పిహెచ్ లెవెల్ పెంచి అసిడిటీని అదుపు చేస్తుంది. లెమన్ వాటర్ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. నిమ్మలోని విటమిన్ C జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది పొద్దున్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. ఆహారంలో నిమ్మరసం పిండి తీసుకున్నా మేలు కలుగుతుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com