వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో జలుబు మొదటిస్థానంలో ఉంటుంది. వర్షంలో తడవడం, వివిధ కారణాల వల్ల జలుబు త్వరగా ఎటాక్ అవుతుంది. ఈ జలుబు రాకుండా, వచ్చినా త్వరగా ఉపశమనం పొందేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు. అల్లాన్ని నీటిలో మరగబెట్టి తాగితే.. జలుబునుంచి రిలీఫ్ ఉంటుంది. గొంతు గరగర దూరమవుతుంది. నిమ్మరసం, తేనెను సమానంగా తీసుకుని కలిపి తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. ఆవిరి పడితే జలుబు తగ్గుముఖం పడుతుంది. పెద్దల నుంచి పిల్లలు కూడా ఇది ఫాలో అవ్వొచ్చు. చికెన్, టొమాటో సూప్‌లు వంటివి వేడిగా తీసుకోవాలి. ఇది జలుబు నుంచి విముక్తిని అందిస్తుంది. గోరువెచ్చని పాలల్లో పసుపు కలుపుకుని తాగితే జలుబు తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుంది. యూకలిప్టస్ ఆయిల్ జలుబుతో పాటు.. దానివల్ల కలిగే తలనొప్పిని కూడా దూరం చేస్తుంది. వెల్లుల్లి, తేనెను కూడా కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు తగ్గుతుంది. All Images Source : Envato