‘వాసన’తో గుండె సమస్యలను కనిపెట్టేయొచ్చా? ఇదిగో ఇలా!

ఈ రోజుల్లో గుండె సమస్యతో మరణిస్తున్నవారి సంఖ్య బాగా పెరిగింది.

ఈ నేపథ్యంలో లక్షణాలు ముందుగానే తెలుసుకుని డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది.

అయితే, నిపుణులు.. వాసన సమస్యలతో గుండె జబ్బులను తెలుసుకోవచ్చని అంటున్నారు.

కోవిడ్-19 వల్ల చాలామంది వాసన, రుచి చూసే సామర్థ్యాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

వాసన సామర్థ్యంలో లోపాలు.. వృద్ధుల్లో గుండె సమస్యలను తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వాసన శక్తి కోల్పోవడం.. గుండె, నాడీ సంబంధిత సమస్యలకు ముందస్తు సంకేతాలని పేర్కొన్నారు.

వాసన చూసే సామర్థ్యం.. ఆరోగ్యకరమైన రక్తప్రవాహంపై ఆధారడపడి ఉంటుందట.

అందుకే వాసన చూసే శక్తి తగ్గిందంటే.. రక్తం లేదా నాడీ వ్యవస్థలో ఏదో సమస్య ఏర్పడినట్లు తెలుసుకోవాలి.

గుండెలో లోపాలు ఉంటే.. ముక్కులోని ఘ్రాణ నరాలకు రక్త సరఫరా తగ్గిపోతుందట. దాని వల్ల వాసన చూడలేరట.

Images Credit: Canva, Pexels and Pixabay