ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ లివర్ ప్రమాదంలో ఉందని అర్థం శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. మనం తినే ఆహారం, అలవాట్లు.. లివర్‌పై ప్రభావం చూపుతాయి. అయితే, కాలేయ సమస్యలను గుర్తించడం అంత ఈజీ కాదు. బాగా ముదిరిన తర్వాతే లక్షణాలు బయటపడతాయి. అప్పటివరకు అంతా నార్మల్‌గానే ఉంటుంది. అకస్మాత్తుగా బరువు తగ్గుతున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. ఆకలి లేకపోవడం, పొత్తికడుపు ఎగువ భాగంలో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి. వికారం, వాంతులు, నీరసం, మూర్ఛ కూడా కాలేయ సమస్యల వల్లే వస్తాయి. లివర్ వాపు, కళ్లు పసుపు రంగులోకి మారడం (పచ్చ కామెర్లు) కూడా కాలేయ సమస్యల వల్లే వస్తాయి. ఈ లక్షణాల్లో ఏవి కనిపించినా సరే డాక్టర్‌ను సంప్రదించాలి.