ఈ ఎండాకాలంలో బొప్పాయి ఒంటికి చాలా మంచి చేస్తుంది. బొప్పాయిలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దాంట్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలం. ఎండాకాలంలో బొప్పాయి బాడీని హైడ్రేట్ చేస్తుంది. అరుగుదలకి కూడా చాలా మంచిది. బొప్పాయి తినడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ పేషంట్లకి ఇది మంచిది. క్యాన్సర్ వ్యాపించకుండా చేస్తుంది. లైకోపెన్, విటమిన్ - సి ఎక్కువగా ఉండటం వల్ల.. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. అరుగుదలకి చాలా మంచిది. బ్లోటింగ్ ని కూడా దూరం చేస్తుంది. స్కిన్ కి మంచి చేస్తుంది బొప్పాయి. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం ఎర్రగా అవ్వకుండా చేస్తుంది. మరిన్ని హెల్త్ అప్ డేట్స్, టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.