ఈ టిప్స్ పాటిస్తే.. నోటి దుర్వాసన చిటికెలో మాయం!

నోటి దుర్వాసన కొంత మందిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది.

కొంత మంది నోటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా దుర్వాసన వస్తుంది.

కొన్ని టిప్స్ పాటించడం వల్ల నోటి దుర్వాసనను ఈజీగా దూరం చేసుకోవచ్చు.

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల బాడీలోని మలినాలు బయటకు వెళ్లి నోటి దుర్వాసన తగ్గుతుంది.

బ్రష్ చేయగానే లంవంగం నోటిలో వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన మాయం అవుతుంది.

బ్రష్ చేసిన తర్వాత కాస్త కొబ్బరి నూనె నోట్లో వేసుకుని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.

ఆవ నూనెను చిగుళ్ల మీద రుద్దడం వల్ల నోటి ఆరోగ్యం పెరిగి చెడువాసన మాయం అవుతుంది.

వీలున్నప్పుడల్లా పుదీనా ఆకులు నమలడం వల్ల నోరు ఆరోగ్యంగా ఉంటుంది.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com