ఈ రోజుల్లో చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు.
వయసుతో సంబంధ లేకుండా గుండెపోటు వస్తుంది.
రెగ్యులర్ గా వర్కౌట్లు చేసే వారిలోనూ హార్ట్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది.
గుండెపోటుకు ముందు కలిగే కొన్ని సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
ఛాతిలో తీవ్రమైన నొప్పి ఏర్పడి..చేతులు, మెడ, దవడ, వీపుకు వ్యాపిస్తుంది.
ఛాతిలో నొప్పితో పాటు ఊపిరి ఆడకపోవడం, మైకం కలిగితే కచ్చితంగా గుండెపోటుగా భావించాలి.
గుండె దడ తీవ్రంగా పెరగడం కూడా గుండెపోటుకు కారణంగా చెప్పుకోవచ్చు.
విశ్రాంతి తీసుకున్నా అతిగా అలసిపోయినట్లు అనిపిస్తే గుండె సమస్యగా భావించాలి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com