ప్రొటీన్ సప్లిమెంట్స్ ఇష్టానుసారంగా తీసుకుంటే ఈ రిస్క్ తప్పదు గత కొన్నేళ్లుగా ప్రొటీన్ సప్లిమెంట్స్‌ను తీసుకొనేవారి సంఖ్య పెరిగింది. శరీర ప్రొటీన్ అవసరాలను తీర్చేందుకు, కండరాలను బలంగా ఉంచేందుకు వీటిని తీసుకుంటారు ప్రొటీన్ సప్లిమెంట్స్ ఒక క్రుత్రిమ ఉత్పత్తి. వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అతిగా తీసుకోకూడదు ప్రొటీన్ సప్లిమెంట్స్ అధికంగా తీసుకుంటే కలిగే 5 ఆరోగ్య ప్రమాదాల గురించి తెలుసుకుందాం. ప్రొటీన్ సప్లిమెంట్స్ తీసుకుంటే జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ప్రొటీన్ సప్లిమెంట్స్ కూడా IGF-1 హార్మోన్, సెబమ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. మొటిమలు పెరుగుతాయి. ప్రొటీన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటే శరీరం అదనపు కేలరీలను కొవ్వుగా మారుస్తుంది. ప్రొటీన్ సప్లిమెంట్స్ పాల ఆధారితమైనవి. అధికంగా తీసుకుంటే లాక్టోస్ వల్ల కడుపునొప్పి వస్తుంది. అధిక ప్రొటీన్ వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది.