సైక్లింగ్ చేస్తే ఇన్ని లాభాలా! సైక్లింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఫిజికల్, మెంటల్ గా ఆరోగ్యంగా ఉంటారు. గుండెకు చాలామంచిది. బీపీని తగ్గిస్తుంది. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా కాళ్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఆర్తరైటిస్, జాయింట్ సమస్యలను తగ్గిస్తుంది సైక్లింగ్. కరెక్ట్ డైట్ తీసుకుంటూ సైక్లింగ్ చేస్తే బరువు తగ్గుతారు. క్యాలరీలు కూడా తగ్గుతాయి. ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది. గాలి బాగా పీలుస్తాం కాబట్టి.. ఆక్సిజన్ బాగా అందుతుంది. రోజూ సైక్లింగ్ చేస్తే తెల్ల రక్తకణాలు మెరుగవుతాయి. దాంతో ఇన్ ఫెక్షన్స్ రావు, ఇమ్యూనిటీ పెరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది. పొద్దున్నంతా సైక్లింగ్ వల్ల అలసిపోతాం కాబట్టి రాత్రిపూట నిద్రబాగా పడుతుంది. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.