పెరుగు చక్కని పోషకాహారం. ప్రతి రోజూ తప్పకుండా తినాల్సిన పదార్థం కూడా.

కానీ చాలా మంది పెరుగుతినని వాళ్లు ఉంటారు. పెరుగు తినకపోతే ఏమేమి మిస్ అవుతారో తెలిస్తే రోజూ తప్పక తింటారు.

పెరుగులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కనుక పెరుగు రోజూ తినేవారిలో బీపి అదుపులో ఉంటుంది.

పెరుగులో ప్రొబయోటిక్స్ చాలా ఎక్కువ. పెరుగు తినకపోతే ఇవి అందక శరీరంలో ఇమ్యూనిటి తగ్గవచ్చు.

పెరుగులో కాల్షియం ఉంటుంది. పెరుగు తినకపోతే కాల్షియం లభించక దంతాలు, ఎముకలు బలహీనపడతాయి.

పెరుగు తినకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

అందుకే ప్రతి భోజనంలో తప్పనిసరిగా పెరుగుతినడం అలవాటు చేసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చెయ్యలి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహనకోసం మాత్రమే.

Images and Video Credit: Pexels