మధుమేహ సమస్య ఉంటే.. అల్లాన్ని అలా అస్సలు తీసుకోకూడదట

అల్లం ఆరోగ్యానికి మంచిదే.. కానీ అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు నిపుణులు.

అల్లం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఆయుర్వేదంలో కూడా దీనిని వినియోగిస్తారు.

అయితే మంచిది కదా అని దీనిని ఎక్కువగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.

కడుపులో ఇరిటేషన్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలను పెంచుతుంది.

డయారేయా వంటి జీర్ణ సమస్యలు పెరుగుతాయి.

కడుపులో తిప్పడం, నొప్పి, వాంతులు వంటి లక్షణాలు పెరుగుతాయి.

హైపోగ్లోసేమియా ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది రక్తంలో షుగర్​ను తగ్గించేస్తుంది.

దీనిని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో వేడి ఎక్కువై చెమట వస్తుంది.

నిద్రకు ముందు అల్లం ఎక్కువగా తీసుకుంటే నిద్ర సమస్యలు వస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యుల సలహా తీసుకుంటే మంచిది. (All Images Source : Envato)