కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం వల్ల వచ్చే నొప్పి భరించలేనిదిగా ఉంటుంది.

కొన్ని జాగ్రత్తలతో ఇలాంటి నొప్పి బారిన పడకుండా తప్పించుకోవచ్చు.

లంచాన్ మీట్ లో సోడియం, కొవ్వులు, నైట్రేట్ల వంటి ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి.

సోడియం, ప్రిజర్వేటివ్స్, కెమికల్ టేస్ట్ ఎన్హాన్సర్లు ఈ లంచాన్ మీట్ లో ఎక్కువ.

పిజ్జాల్లో, బర్గర్లు ఇతర ఫాస్ట్ ఫూడ్ వంటకాల్లో ఈ మీట్ ఎక్కువ వాడుతారు. వీటి వల్ల కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

కోలాలు, సోడా కలిగిన ఇతర పానీయాలు ఎక్కువగా తీసుకుంటే వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఇవి తినకూడదు.

ఖర్జూరాలు, కిస్మిస్ వంటి ఎండు ఫలాలు పరిమితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

అతిగా తీసుకుంటే వీటిలోని ఆగ్జలేట్ యూరిన్ లోని క్యాల్షియంతో కలిసి కాల్షియం ఆగ్జలేట్ స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉంది.

లంచాన్ మీట్స్, ఎండు ఫలాలు, సోడా డ్రింక్స్ తీసుకోవడం మానెయ్యాలి. మితంగా తీసుకోవాలి.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.