పిల్లలకు వర్షాకాలంలో ఈ ఫుడ్స్ పెడితే చాలా మంచిదట

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్యంగా చిన్నపిల్లలు వర్షంలో తడిచేందుకు ఎక్కువ ఇష్టపడుతుంటారు.

కానీ దానివల్ల వారికి జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.

అందుకే వారి ఫుడ్స్​లో కొన్ని ఆహారాలు చేర్చాలంటున్నారు నిపుణులు.

అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనివల్ల సీజనల్ వ్యాధులు దూరమవుతాయి. జీర్ణ సమస్యలు దూరం చేస్తుంది.

వెల్లుల్లి యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని అందిస్తాయి.

ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఫుడ్స్ అందిస్తే జీర్ణ సమస్యలు కూడా రావు. ఇవి శక్తిని కూడా అందిస్తాయి.

సీజన్ ఏదైనా.. ఆ సమయంలో దొరికే ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆకు కూరల్లో విటమిన్స్ ఏ, సి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.

ఈ ఫుడ్స్ అన్ని న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జబ్బులను దూరం చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుంటే చాలా మంచిది. (Images Source : Envato)