అది కలిపి తీసుకుంటే..

అంజీర్​ను పాలల్లో కలిపి తీసుకుంటే హెల్త్​కి చాలా మంచిదంటున్నారు నిపుణులు.

Published by: Geddam Vijaya Madhuri

జీర్ణ సమస్యలుంటే..

పాలల్లో అంజీర్​ని కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య పూర్తిగా పోతుంది. డైటరీ ఫైబర్స్ శరీరానికి అంది.. జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం కంట్రోల్ అవుతుంది.

బోన్స్ హెల్త్

అంజీర్​లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని పాలతో కలిపి తీసుకుంటే ఎముకలు, దంతాలు స్ట్రాంగ్​ అవుతాయి.

హెల్తీ స్కిన్​

అంజీర్​లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ నిండుగా ఉంటాయి. ఇవి పాలతో కలిపి తీసుకున్నప్పుడు మీ స్కిన్ గ్లో అవుతుంది. చర్మం మాయిశ్చరైజ్ అవుతుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది.

బరువు తగ్గించడంలో

బరువు తగ్గాలనుకునేవారైతే అంజీర్​ను తమ డైట్​లో చేర్చుకోవచ్చు. దీనిలో ఫైబర్ నిండుగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి మీరు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేసి.. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి.

రోగనిరోధక శక్తి

ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ చాలా అవసరం. విటమిన్స్, మినరల్స్​తో నిండి అంజీర్​ను పాలతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ ఇన్​ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

బ్లడ్ షుగర్

షుగర్​తో ఉండేవాళ్లు కూడా ఈ కాంబినేషన్​ తీసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తాయి.

గుండె సమస్యలకై..

పాలల్లో అంజీర్ కలిపి తీసుకుంటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పాలల్లోని కాల్షియం హార్ట్​ని హెల్తీగా ఉంచి.. చెడు కొలెస్ట్రాల్​ని తగ్గిస్తుంది.

శక్తినిస్తుంది

పాలల్లోని ప్రోటీన్.. అంజీర్​లోని స్వీటనర్స్ శరీరానికి శక్తినిస్తాయి. దీనివల్ల మెటబాలీజం కూడా పెరుగుతుంది.

నిద్ర సమస్యలుంటే

నిద్ర సరిగ్గా రాని వారు.. వివిధ నిద్ర సమస్యలతో ఇబ్బందిపడేవారు రెగ్యూలర్​గా దీనిని తీసుకుంటే నిద్ర నాణ్యత పెరుగుతుంది.

అవగాహన కోసమే..

ఇవన్నీ అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుని ఫాలో అయితే మంచిది. (Images Source : Envato)