నొప్పి వచ్చిన వెంటనే వైద్యుణ్ని సంప్రదించే వీలు ఉండదు.
దీర్ఘకాలిక నివారణకు మాత్రం వైద్యుణ్ని సంప్రదించాలి
ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అని గ్రహించండి.
గోరు వెచ్చని నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి 30 సెకన్లపాటు పుక్కిలించండి. వాపు తగ్గుతుంది. బ్యాక్టీరియాను చంపుతుంది.
ఐస్‌ను ఒక గుడ్డలో చుట్టీ బుగ్గపై 15-20 నిమిషాలు ఉంచండి. నొప్పి వాపు తగ్గుతుంది.
వెల్లుల్లి రెబ్బను నలిపి నొప్పిగా ఉన్న పంటికి రాయండి.
ఒక దూదిపై 1-2 చుక్కల లవంగం నూనె వేసి నొప్పిగా ఉన్న పంటిపై ఉంచండి. దీనిలో యూజినాల్ కారణంగా నొప్పి తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
పసుపు, ఉప్పు కలిగిన పేస్ట్ పూయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
చల్లని లేదా వేడి పిప్పరమింట్ టీ బ్యాగ్‌ను పంటిపై ఉంచండి. మెంథాల్ చల్లదనాన్ని, ఉపశమనాన్ని అందిస్తుంది.
ఉల్లిపాయ ముక్కను నమలడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది. వేప రసం లేదా వేప ఆకులతో పుక్కిలించండి.
నొప్పి ఎక్కువసేపు కొనసాగితే వాపు పెరిగితే వెంటే దంత వైద్యుడిని సంప్రదించండి.