శీతాకాలంలో చలి నుంచి ఉపశమనం పొందడానికి మనం వేడి నీళ్లతో స్నానం చేస్తుంటాం

శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం వల్ల మన గుండెకు ప్రమాదం

Published by: Khagesh

శీతాకాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండెపోటు లేదా ఆకస్మిక మరణాలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

కొంతమంది విషయంలో ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది.

శీతాకాలంలో శరీర నరాలు చలికి కుంచించుకుపోతాయి.

కానీ అకస్మాత్తుగా వాటిపై చాలా వేడి నీటిని పోసినప్పుడు ఈ నరాలు వేగంగా విస్తరిస్తాయి.

ఇది రక్తపోటులో ఆకస్మిక హెచ్చుతగ్గులకు కారణమవుతుంది.

ఇది గుండెపై ఒత్తిడి కలిగిస్తుంది.

వేడి నీళ్ల స్నానం చేసిన తర్వాత ఎవరైనా అకస్మాత్తుగా చల్లని వాతావరణంలోకి, గాలికి వచ్చినప్పుడు రక్తపోటు వేగంగా పెరుగుతుంది.

ఇది గుండెపోటు లేదా స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచుతుంది.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా వచ్చే మార్పులు గుండెపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది.

జపనీస్‌ అధ్యయనాల ప్రకారం, ఈ పరిస్థితిని హీట్‌షాక్ ఫినోమినా అని పిలుస్తారు.

శీతాకాలంలో బాత్ టబ్‌లో వేడి నీటితో స్నానం చేస్తున్నప్పుడు అకస్మిక మరణాలు, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా రిజిస్టర్ అవుతున్నాయి.

బ్రిటీష్‌ హార్ట్‌ ఫౌండేషన్ ప్రకారం ఈ ఆకస్మిక మార్పు గుండె లయ కూడా ప్రభావితం చేస్తుంది.

50 ఏళ్లు పైబడిన వారికి లేదా ఇప్పటికే అధిక రక్తపోటు, డయోబెటిస్‌, కొలస్ట్రాల్‌, గుండె జబ్బులతో బాధఫడుతున్న వారికి సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది.

ఎక్కువ వేడి నీటితో స్నానం చేయొద్దు, మీ తలపై నేరుగా నీటిని పోయొద్దు. ముందుగా మీ పాదాలు, చేతులపై నీటిని పోయాలి.

బాత్రూమ్‌ ఉష్ణోగ్రతను వెచ్చగా ఉంచడానికి ప్రయత్నించండి. వృద్ధులు లేదా గుండె జబ్బులున్న రోగులు ఒంటరిగా స్నానం చేయకూడదు.

స్నానం చేసేటప్పుడు మీకు తల తిరుగుతున్నట్టు లేదా నీరసంగా ఉంటే వెంటనే ఆపేయండి.