ఇలా చేస్తే.. కిడ్నీలు పాడైపోవడం ఖాయం మన శరీరంలో కిడ్నీలు ముఖ్యమైన అవయవాలు. మూత్రపిండాలు మన శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి. కిడ్నీల్లో ఏమైనా సమస్యలు వస్తే వ్యర్థాలు శరీరంలోనే పేరుకుపోతాయి. ఫలితంగా వ్యాధులకు గురవ్వుతాము. మూత్ర పిండాల్లో వ్యర్థాలు అనారోగ్య సమస్యలకు దారి తీయడమే కాదు.. ప్రాణాలూ తీస్తాయి. సోడియం, పాస్పరస్ అతిగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నా కూడా మీ కిడ్నీలు చెడిపోతాయి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండంటం చాలా మంచిది. కిడ్నీ సమస్యలే కాదు.. మరి ఏ అనారోగ్యాలు మీ దరి చేరవు. ఉప్పు అతిగా తినేవారి కిడ్నీలు కూడా త్వరగా పాడైపోతాయి. అతిగా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారా? అయితే మీకు కిడ్నీ క్యాన్సర్ రావచ్చు. రోజూ తగిన నీటిని తాగడం ద్వారా కిడ్నీ సమస్యల నుంచి బయటపడొచ్చు. కాబట్టి.. మంచి అలవాట్లతో మీ కిడ్నీలను కాపాడుకోండి. ఆరోగ్యంగా జీవించండి.