మంకీ పాక్స్ దగ్గరకు వచ్చేసింది, ఈ జాగ్రత్తలు పాటించండి ప్రపంచాన్ని కలవరపెడుతోన్న మరో మహమ్మారి మంకీ పాక్స్. దీన్నే ‘ఎంపాక్స్’ అంటున్నారు. ఆఫ్రికాలో ఇప్పటికే వందలాది మంది మరణించారు. దీంతో WHO హెల్త్ ఎమర్జెన్నీ ప్రకటించింది. ఇప్పుడిది సింగపూర్, థాయ్‌లాండ్‌లకు కూడా వ్యాపించింది. అక్కడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు హైదరాబాదీ అయితే, తస్మత్ జాగ్రత్త. మీరు బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా శానిటైజర్ లేదా సబ్బు, హ్యాండ్ వాషర్‌తో చేతులు కడగాలి. మంకీపాక్స్ వ్యక్తుల నుంచి మరొకరికి వేగంగా సోకుతుంది. కాబట్టి, కాస్త దూరం పాటించడం ఉత్తమం. విచ్చలవిడి శారీరక కలయికలు వద్దు. స్వలింగ సంపర్కం అస్సలు వద్దు. మాస్కులు తప్పకుండా ధరించాలి. వైరస్ సోకిన వారం తర్వాత జ్వరం, చలి, తలనొప్పి, తీవ్రమైన అలసట, ఆకస్మాత్తుగా మొదలవుతాయి. ఈ వ్యాధి సోకితే చేతులు, శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. వెంటనే చికిత్స పొందితే ప్రాణాలతో బయటపడొచ్చు.