వామ్మో, చెంపదెబ్బ వైరస్.. ఆ దేశాన్ని భయపెడుతోన్న వింత వ్యాధి చాచి.. ముఖం మీద ఒక్కటిస్తే.. దాన్ని చెంపదెబ్బ అంటారని మీకు తెలిసిందే. అయితే, ఆ పేరుతో ఓ వైరస్ కలకలం రేపుతున్న సంగతి మీకు తెలుసా? అది మరెక్కడో కాదు.. అమెరికాలో. దాన్ని ‘స్లాప్డ్ చీక్’ అంటున్నారు అక్కడ. చెంప దెబ్బ తగిలిన తర్వాత బుగ్గ ఎర్రగా మారిపోతుందనే సంగతి తెలిసిందే. స్లాప్డ్ చీక్ వైరస్ సోకినవారి చెంప కూడా అదే విధంగా ఎర్రగా మారిపోతుంది. ఫార్వోవైరస్ B19 అనే రెస్పిరేటర్ ఇన్ఫెక్షన్ సీజనల్‌గా వ్యాప్తిస్తుంటుంది. దాన్నే ‘స్లాప్డ్ చీక్’ అంటారు. ఈ వ్యాధి ఎక్కువగా చిన్న పిల్లల్లో కనిపిస్తుంటుంది. ఇది సోకితే బుగ్గలపై ఎర్ర దద్దర్లు వస్తాయి. ఇది జలుబు తరహాలోనే తుమ్ము, దగ్గు లేదా రోగులను టచ్ చేసినా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకితే బ్లడ్ ప్లేట్‌లేట్స్ పడిపోతాయట. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలి.