పాలతో కలిపి ఈ ఫుడ్స్ తింటున్నారా? పాలతోపాటు తినకూడని పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. నారింజ, నిమ్మ, ద్రాక్షపండ్లు పాలతో పాటు తినకూడదు. ఇవి కొంతమందికి జీర్ణంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. స్పైసీ ఫుడ్స్ పాలతో కలిపి తీసుకుంటే జీర్ణసమస్యలు మరింత పెరుగుతాయి. ఇదియాసిడ్ రిఫ్లెక్స్ , గుండెలో మంటకు దారితీస్తుంది. అరటిలోని ఒక రకమైన ప్రొటిన్ ఉంటుంది. పాలతో అరటి తింటే జీర్ణసమస్యలు లేదా ఉబ్బరానికి దారితీస్తుంది. చేపలను పాలతో కలిపి తినకూడదు. సాల్మాన్, మాకేరెల్ వంటి చేపలు జీర్ణక్రియను పాడుచేస్తాయి. ఊరగాయలు లేదావెనిగర్ ఆధారిత వంటకాలు పాలతో తినకూడదు. డైరీ మిల్క్ తోపాటు టోఫు లేదా సోయా మిల్క్ వంటి ఉత్పత్తులు పాలతో తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. వేయించిన ఆహారాలు లేదా కొవ్వు మాంసాలు వంటి అధిక కొవ్వు పదార్థాలు పాలతో తింటే జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, పాలు కలిగి తినకూడదు. కొంతమందిలో జీర్ణసమస్యలను కలిగిస్తుంది. బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ , మొలకలు వంటి కూరగాయలు పాలతో తినకూడదు.