ఒత్తిడిలో ఉన్నప్పుడు ఈ ఫుడ్స్ తినకూడదట మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెర పదార్థాలు తినకూడదు. షుగర్ మానసిక స్థితికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ తరచుగా తీసుకుంటే ఒత్తిడి,అలసట పెరగుతుంది. కెఫిన్ తాత్కాలిక శక్తికి బూస్ట్ అందిస్తుంది. కానీ కెఫిన్ ఎక్కువగా తీసుకుంటే ఆందోళన మరింత పెరుగుతుంది. ఆల్కహాల్ ఒత్తిడిని తగ్గించినట్లు అనిపిస్తుంది. కానీ నిద్రకు భంగం కలిగిస్తుంది. దీర్ఘకాలిక ఆందోళనకు కారణం అవుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటే ఒత్తిడి మరింత పెరుగుతుంది. మితిమీరిన ఉప్పు అనారోగ్య సమస్యలతోపాటు ఉబ్బరం, డీహైడ్రేషన్, ఒత్తిడికి కారణం అవుతుంది. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ మానసిక స్థితి, మొత్తం ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడికి దోహదం చేస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లో అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెర, సోడియం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడిని మరింత పెంచుతుంది. శుద్ధిచేసిన వైడ్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెరను పెంచుతాయి. మానసిక కల్లోలానికి దారి తీస్తాయి. కృత్రిమ స్వీటెనర్లు న్యూరోట్రాన్స్మిటర్ పనితీరుకు అంతరాయం కలిగిస్తాయి.