బాదం పప్పులో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది బాదంపప్పు నానబెట్టి తింటారు. అయితే, దాన్ని ఎలా తింటే పోషకాలు బాగా అందుతాయో చూద్దాం. బాదంపప్పు నానబెట్టి తింటే తొందరగా అరుగుతుంది. పచ్చిది తింటే అరగడం కష్టం. నానబెట్టిన బాదంలో పైటిక్ యాసిడ్ తక్కువ ఉంటుంది. పోషకాలు బాగా అందుతాయి. మాములుగా తింటే పోషకాలు తొందరగా అందవు. మినరల్స్ కూడా శరీరానికి అందవు. నానబెట్టిన బాదాం తినేందుకు బాగుంటాయి. బ్లెండ్ అవుతాయి. మాములుగా తింటే టేస్ట్ ఉండవు. బాదం తొక్క తీసి తింటే మంచిది. నానబెడితే సులువుగా తొక్క తీయొచ్చు. బాదంలో ఉండే పోషకాలు నానబెట్టి తింటే త్వరగా శరీరానికి అందుతాయి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.