సాధారణంగా క‌ర్జూరం తింటే దాంట్లోని విత్త‌నం ప‌డేస్తాం.

ఆ విత్త‌నంలో ఎన్నో పోష‌క‌ల విలువ‌లు ఉంటాయి.

ఆ విత్త‌నాల‌ను పొడి చేసుకుని తాగితే ఎన్నో లాభాలు.

ఖర్జూర విత్తనాల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌. కాబట్టి ఆహారం అరిగేందుకు సహకరిస్తుంది. గ‌ట్ హెల్త్ కి మంచిది.

క‌ర్జూర గింజల పొడి షుగ‌ర్ ని కంట్రోల్ చేస్తుంది. గ్లైస‌మిక్ ఇండెక్స్ శాతం త‌గ్గిస్తుంది.

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఒంట్లోని క‌ణాలు పాడ‌వ్వ‌వు. గుండె జ‌బ్బుల‌ను త‌గ్గిస్తుంది.

అయితే, దీన్ని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌ద్ద‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. శ‌రీరానికి నిదానంగా అల‌వాటు చేయాలి.

ఈ పొడిని పాల‌ల్లో, మిల్క్ షేక్స్ లో, స్మూథీస్ లో క‌లుపుకుని తాగొచ్చు. కుక్కీస్, బ్రెడ్, కేక్ మేకింగ్ లో కూడా వేస్తే మంచిది.

మెడికేష‌న్ లో ఉన్న‌వాళ్లు, మెడిసిన్స్ వాడేవాళ్లు ఒక‌సారి డాక్ట‌ర్ ని సంప్ర‌దించిన త‌ర్వాత వాడితే మంచిది.

Image Source: Pexels

ఇలాంటి మ‌రిన్ని హెల్త్ టిప్స్ కోసం ఏబీపీని ఫాలో అవ్వండి.