శీతాకాలంలో రూమ్ హీటర్లు ఎంత ఉపశమనం కలిగిస్తాయో, అదే స్థాయిలో ప్రమాదానికి కారణవుతాయి.

Published by: Khagesh

మూసివేసిన గదిలో ఎక్కువసేపు హీటర్‌ రన్ అయితే ఆక్సిజన్ తగ్గిపోతుంది కార్బన్ మోనాక్సైడ్ పెరుగుతుంది.

దీని వల్ల నిద్రపోతున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి, ప్రాణాంతకం కూడా కావచ్చు.

హీటర్ ఉన్న గదిలో కొంత వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది.

హీటర్‌ను మంచం లేదా కర్టెన్ల దగ్గర ఉంచొద్దు. నేలపై, స్థిరమైన ప్రదేశంలో, మండే వస్తువులకు దూరంగా ఉంచండి

హీటర్‌ను మంచం లేదా కర్టెన్ల దగ్గర ఉంచొద్దు. నేలపై, స్థిరమైన ప్రదేశంలో, మండే వస్తువులకు దూరంగా ఉంచండి

నైట్‌ టైంలో హీటర్‌ను కంటిన్యూగా ఆన్‌లో ఉంచడం సురక్షితం కాదు.

గదిలో అధిక తేమ లేదా తక్కువ ఆక్సిజన్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్లే ప్రమాదం ఉంది.

పడుకునే ముందు గదిని వేడి చేసి, హీటర్‌ను ఆపివేయడం మంచి విధానం.

హీటర్‌ కోసం ఎక్స్‌టెన్షన్ కార్డ్‌ను ఉపయోగించకపోవడం మంచిది. ఓవర్‌లోడింగ్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది.

పిల్లలు , వృద్ధులకు దగ్గర హీటర్ ఉంచొద్దు. ఆయిల్ హీటర్లు లేదా సిరామిక్ హీటర్లు సురక్షితమైనవి

హీటర్‌ను క్రమం తప్పకుండా సర్వీస్ చేయడం కూడా అంతే ముఖ్యం.

దుమ్ము పేరుకుపోయి హీటింగ్ ఎలిమెంట్‌ దెబ్బతిని పొగ వచ్చే అవకాశం పెరుగుతుంది.

ఉపయోగించే ముందు హీటర్‌ను శుభ్రం చేయండి.