అదే పనిగా కూర్చుంటే గుండెకు ముప్పు తప్పదా? శారీరక శ్రమ తగ్గడం వల్ల గుండె సంబంధ సమస్యలు తలెత్తుతాయి. గంటలు గంటలు కూర్చుంటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. రోజూ 4 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చుంటే ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. రోజుకు 8 నుంచి 11 గంటలు కూర్చుంటే తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. గంటలు గంటలు కూర్చోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. అధిక బరువు గుండె జబ్బుల ముప్పును పెంచుతుంది. రోజూ తగినంత వ్యాయామం, శ్రారీరక శ్రమ తప్పనిసరి అంటున్నారు నిపుణులు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com