పరగడుపునే కరివేపాకు తింటే ఎన్ని ప్రయోజనాలో.. షుగర్ ఉన్నవాళ్లకి ఇంకా మంచిది

Published by: Geddam Vijaya Madhuri

కరివేపాకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే దీనిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

అయితే దీనిని పరగడుపునే నేరుగా తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చట.

దీనిలో విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

అందుకే ఉదయాన్నే పరగడుపున ఓ 5 కరివేపాకులు తింటే ఆరోగ్యానికి చాలామంచిదట.

ఇది ఆకలిని కంట్రోల్ చేసి ఎక్కువ తినడాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గుతారు.

జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కడుపు ఉబ్బరం, ఇతర లక్షణాలు తగ్గుతాయి.

హెల్తీ స్కిన్​ ఇస్తుంది. పింపుల్స్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

బ్లడ్​ షుగర్​ ఉన్నవాళ్లు పరగడుపునే కరివేపాకు తింటే మంచి ఫలితాలు పొందుతారట.

జుట్టు రాలే సమస్య కంట్రోల్ అవుతుంది. హెల్తీ హెయిర్​ని ప్రమోట్ చేస్తుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణులు సలహా తీసుకుంటే మంచిది. (Images Source : Envato)