ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని పోషకాలు అందాలి. కానీ, చక్కర (షుగర్స్) మాత్రం అస్సలు మంచిది కాదు. అందుకే, మోతాదుకు మించి చక్కెర తీసుకోవద్దని చెప్తున్నారు డాక్టర్లు. మరి రోజులో ఎంత శాతం చక్కెర తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది? చక్కెర లో ఎలాంటి పోషకాలు ఉండవు. అందుకే, దాన్ని తినకపోవడమే మంచిది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రోజుకి ఎంత షుగర్ తీసుకోవాలంటే? పురుషులు - 150 కేలరీలు అంటే 3.75 గ్రాములు లేదా 9 టీ స్పూన్లు. స్త్రీలు - 100 కేలరీలు అంటే 25 గ్రాములు లేదా 6 టీ స్పూన్లు. రోజువారి కేలరీల్లో దాదాపు 10 శాతం తక్కువ తీసుకుంటనే మంచిది. చక్కెరకి బదులుగా బెల్లం, తేనె లాంటివి తీసుకోవాలని చెప్తున్నారు డాక్టర్లు.