ఇవి తింటే పని బాగా చేస్తారట! ఎంత యాక్టివ్ గా పనిచేస్తే అంత గుర్తింపు వస్తుంది. కానీ, ఇప్పుడు ఎండాకాలం తొందరగా నీరసం వచ్చేస్తుంది. అలా నీరసం లేకుండా యాక్టివ్‌గా పనిచేయాలంటే ఇవి తినాల్సిందే. జీడి పప్పు, బాదం పప్పు, పిస్తాలో ఫైబర్, ప్రొటీన్, పొషకాలు ఉంటాయి. వాటివల్ల రోజంతా ఉత్సాహంతో వర్క్ చేస్తారు. గ్రీన్ యోగర్ట్ లో ప్రొబయాటిక్స్, ప్రొటీన్ ఉంటుంది. అది గట్ హెల్త్ కి మంచిది. యాక్టివ్ గా ఉంచుతుంది. అరటిపండు, యాపిల్, బెర్రీస్ లో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ చురుగ్గా పనిచేసేలా చేస్తాయి. డార్క్ చాక్లెట్ లోని యాంటీ ఆక్సిడెంట్స్, కెఫైన్ ఏకాగ్రతను పెంచుతాయి. 70% కోకో ఉంటే మంచిది. హమ్ముస్, హోల్ గ్రెయిన్ క్రాకర్స్ లో ప్రొటీన్, కాంప్లెక్స్ కార్బొహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తాయి, ఫోకస్‌ను పెంచుతాయి. నట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి తింటే ప్రొటీన్స్, గుడ్ ఫ్యాట్, పోషకాలు అన్ని లభిస్తాయి. దీంతో యాక్టివ్ గా ఉంటారు. ఉడకబెట్టిన గుడ్లలో ప్రోటీన్స్ పుష్కలం. అవి మిమ్మల్ని రోజంతా యాక్టీవ్‌గా ఉంచుతాయి.