స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే.. ఇవి తినాల్సిందే గుడ్లలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. నిత్యం గుడ్లు తింటే స్మెర్మ్ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బచ్చలికూరలో ఫొలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే బచ్చలికూర తినాలి. అరటిలో విటమిన్ ఎ, బి1, సిలతో నిండి ఉంటుంది. ఆరోగ్యకరమైన స్పెర్మ్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. బ్రోమెలైన్ అరటిపండ్లలో కనిపించే ఎంజైమ్, వాపును తగ్గిస్తుంది. స్పెర్మ్ క్వాలిటీని పెంచుతుంది. ఆస్పరాగాస్ లో విటమిన్ సి ఉంటుంది. ఇది స్పెర్మ్ కౌంట్ ను పెంచడంతో పాటు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. డార్క్ చాక్లెట్స్ లోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా స్పెర్మ్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తప్రసరణను మెరుగ్గా అందిస్తాయి. స్పెర్మ్ వ్యాల్యూమ్ ను పెంచుతాయి. గుమ్మడి గింజలు, టమాటోలు, వెల్లుల్లి, దానిమ్మ, ఇవన్నీ కూడా స్పెర్మ్ దెబ్బతినకుండా కాపాడుతాయి