కుంకుమ పువ్వు పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారా? గర్భిణీలు తరచుగా కుంకుమ పువ్వు పాలు తాగుతారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే పిల్లలు తెల్లగా పుడతారని భావిస్తారు. అందులో ఎలాంటి నిజం లేదంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏ రంగులో ఉంటే పిల్లలు అదే రంగులో పుడతారు. పేరెంట్స్ జన్యు కణాలను బట్టి పిల్లల రంగు ఏర్పడుతుంది. భార్య, భర్త తరఫు కుటుంబ సభ్యుల రంకు కూడా వచ్చే అవకాశం ఉంది. కుంకుమ పువ్వు పాలలో కలిపి తాగడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుట్టే అవకాశం ఉంది. గర్భిణీలు సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.