నరాల బలహీనతకు చెక్ పెట్టే వండర్‌ఫుల్ యోగాసనాలివే!

Published by: Khagesh

యోగా కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా నరాల కణజాలాలను యాక్టివేట్ చేస్తుంది.

తడాసనం వేయడం వెన్నుపూస నిటారుగా ఉండి నరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

భుజంగాసనం వల్ల వెన్నుపాము సాగి మెడ, నడుము భాగాల్లో నరాల బలహీనతలను నివారిస్తుంది.

పశ్చిమోత్తాసనం వల్ల మోకాళ్లు సైయాటికా నరాలపై ప్రభావం చూపి తిమ్మిర్లు తగ్గిస్తుంది.

అధో ముఖ శ్వానాసనం మెదడు, కేంద్ర నాడీ వ్యవస్థకు రక్తప్రసరణ వేగం పెరిగి నరాల కణాలను రీఛార్జ్ చేస్తుంది.

విపరీత కరణి ఆసనం ద్వారా వల్ల పాదాల తిమ్మిర్లు, మంటలు, నరాల వాపు తగ్గిస్తుంది. రక్తం గట్టకట్టకుండా చూస్తుంది.

బాలాసనం శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, అటానమిక్ నాడీ వ్యవస్థను ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్తుంది.

ఉత్తానాసనం వెన్నుముకలోని ప్రతి నరం సాగుతుంది. కణాల మధ్య సమాచార మార్పిడి వేగం పెరుగుతుంది.

శవాసనం దెబ్బతిన్న లేదా బలహీనపడిన నరాల కణాలు ఆటోమేటిక్‌గా నయం అవుతాయి.

ప్రాణాయామం ద్వారా శరీరంలోని 72వేల నాడులు శుద్ధి అవుతాయి.

మంచి ఫలితాల కోసం రోజూ కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు ఈ ఆసనాలు ఖాళీ కడుపుతో వేయాలి.