నరాల బలహీనత అంటే ఏంటీ? ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు!

Published by: Khagesh

శరీరంలో మెదడు, వెన్నుపాము నుంచి మిగిలిన అవయవాలకు సమాచారం ప్రచారం చేసేవే నరాలు.

ఇలాంటి నరాలు పని చేయడంలో స్లో అయినా పని చేయకపోయినా నరాల బలహీనత అంటారు. వైద్య భాషలో న్యూరోపతి అని అంటారు.

ఇది మొదట పాదాలు, కాళ్లపై చూపించి తర్వాత చేతులకు వ్యాపిస్తుంది. ఇది మొదటి రకం.

బాడీలో ఆటోమేటిక్‌గా పని చేసే శ్వాసక్రియ, రక్తప్రసరణ, జీర్ణక్రియ, మూత్రాశయ పనితీరు నియంత్రించే నరాలు దెబ్బతింటే సమస్య తెలుస్తుంది. ఇది రెండో రకం.

మూడోది నడుము, తుంటి, తొడలు, లేదా ఏదైనా నిర్ధిష్ట భాగం పనిచేయదు.

నరాల బలహీనత మూడు రకాల(మోటారు, సెన్సరీ, అటానమిక్‌) నాడులపై ప్రభావం చూపుతుంది.

కాళ్లు, చేతుల్లో సూదులతో గుచ్చుతున్నట్టు, చీమలు పాకుతున్నట్టు, జలదరింపు రావడం, స్పర్శ తెలియకపోవడం దీని ప్రాథమిక లక్షణాలు

అకస్మాత్తుగా నొప్పిరావడం, షాక్ కొట్టినట్టు అనిపించడం, విపరీతమైన మంట, రాత్రివేళల్లో అసౌకర్యంగా ఉంటుంది.

చేతులు, కాళ్లలో శక్తి తగ్గిపోతుంది. వస్తువులు గట్టిగా పట్టుకోలేరు. నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు.

డయోబెటిస్ ఉన్న వారిలో ఎక్కువ వస్తుంది. దీన్ని డయోబెటిక్ న్యూరోపతి అంటారు.

నరాల ఆరోగ్యానికి బి12, బి 6, ఇ విటమిన్లు లోపిస్తే నరాల బలహీనత త్వరగా వస్తుంది.