కొబ్బరి వెనిగర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని ఎసిటిక్ యాసిడ్ బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కొకొనెట్ వెనిగర్ ఉపయోగించవచ్చు. ఇది ఆకలిని కంట్రోల్ చేసి ఎక్కువ సేపు కడుపు నిండేలా చేస్తుంది. ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండి జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును కంట్రోల్ చేసి.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. (Image Source : Pexels)