శిలాజిత్తు తింటే ఎన్నో లాభాలు

చూడటానికి బొగ్గు ముక్కలా ఉంటుంది శిలాజిత్తు.

హిమాలయాలు, హిందుకుష్ పర్వత శ్రేణుల్లో ఈ ఖనిజం లభిస్తుంది.

మొక్కలు, చెట్ల సంబందిత పదార్థాలు రాళ్లమధ్యలో చిక్కుకపోయి కొన్ని వేల ఏళ్ల పాటూ కుళ్లి నల్లగా మారి గట్టి బంక వంటి పదార్థంగా మారుతాయి.అదే శిలాజిత్తు.

శిలాజిత్తును పొడి రూపంలో, చిన్న ముక్కల రూపంలో, ద్రవ రూపంలో అమ్ముతున్నారు.

ఆయుర్వేద వైద్యులు అనేక ఆరోగ్య సమస్యలకు శిలాజిత్తును సూచిస్తారు.

పురుషులు ఈ శిలాజిత్తును తరచూ తీసుకోవడం వల్ల వారిలో సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. వారిలో వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది.

రక్తహీనత సమస్య ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే దీనిలో నిండుగా ఐరన్ ఉంటుంది.

అల్జీమర్స్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. పొట్టలో అల్పర్లు ఉన్నవారు కూడా దీన్ని వాడవచ్చు.

గుండె, హైబీపీ సమస్యలకు ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.