ఈ పండ్లు పేరేమిటో తెలుసా?

ఫోటో చూడగానే టమోటోలు అనుకుని ఉంటారు. ఇవి ఒక టేస్టీ పండ్లు.

రామా ఫలాల్లో ఇవి ఒక రకం. వీటినే బుల్లక్ హార్ట్ అని కూడా పిలుస్తారు.

రామాఫలం తీయగా ఉండి, విటమిన్ సి అందిస్తుంది. ఈ పండు తింటే చర్మం, జుట్టు మెరుపును సంతరించుకుంటాయి.

రామాఫలం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు,కాబట్టి మధుమేహులకు మంచిది.

రక్తహీనతతో బాధపడుతున్నవారికి రామాఫలం ఎంతో మేలు చేస్తుంది.

ఈ పండు శరీరంలో ఇనుము స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.

ఈ పండు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంతో పాటూ, మూత్రపిండాల్లో రాళ్లుఏర్పడకుండా అడ్డుకుంటుంది.

ఎలాంటి భయాలు పెట్టుకోకుండా రామాఫలాన్ని అందరూ ఆస్వాదించవచ్చు.