బెండ ఆరోగ్యానికి కొండంత అండ!

బెండకాయలో విటమిన్-A, K, నియాసిన్, ఫోలేట్, పాస్పరస్ ఉంటాయి.

ఇంకా జిక్, కాపర్‌, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి.

శరీరానికి కావల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, కాటెచిన్, క్వెర్సెటిన్ కూడా ఉంటాయి.

బెండకాయలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

బెండలోని పెక్టిన్‌ అనే ఫైబర్‌ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

బెండ జీర్ణశక్తిని పెంచి పేగు సంబంధ జబ్బుల ముప్పును తగ్గిస్తుంది.

బెండలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

బెండలోని విటమిన్‌C శరీరంలో మలినాలను బయటకు పంపి చర్మానికి మేలు చేస్తుంది.

బెండకాయలోని జింక్ స్త్రీ, పురుషుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. All Photos Credit:pexels.com