అలసట, నీరసంగా అనిపించినప్పుడు ఖర్జూరం తినడం వల్ల తక్షణ శక్తి వస్తుంది. నానబెట్టిన ఖర్జూరాలు ఉదయం పూట రెండు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక రోగాలని దూరం పెట్టొచ్చు. బరువు తక్కువగా ఉన్న వాళ్ళు నెయ్యితో కలిపి వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువును పొందుతారు. మలబద్ధకాన్ని నివారిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకల ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ ని నియంత్రిస్తుంది లైంగిక శక్తిని పెంచుతుంది. గర్భిణులకి అవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయ్ ఖర్జూరంతో చేసిన లడ్డూలు పిల్లలకి పెట్టడం వల్ల బలంగా తయారవుతారు. రక్తహీనతకి చెక్ పెడుతుంది. చర్మం, జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది