చలికాలంలో నారింజ తప్పక తినాలి. ఎందుకో తెలియాలంటే.. ఈ ప్రయోజనాలు గురించి తెలుసుకోవాల్సిందే.

నారింజలో ఉండే కెరోటినాయిడ్ కళ్ల శ్లేష్మ పొరలను కాపాడి వయస్సు పెరగటం వల్ల వచ్చే కంటి సమస్యలను తగ్గిస్తుంది.

నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై వృద్ధాప్య ఛాయలు లేకుండా చేస్తుంది.

నారింజలో ఉండే విటమిన్ B6, మెగ్నీషియం శరీరంలో హెమోగ్లోబిన్ ను పెంచడంలో సహాయపడి రక్త పోటును తగ్గిస్తుంది.

నారింజ శరీరంలో ఐరన్‌ను గ్రహించేందుకు తోడ్పడుతుంది. రక్తహీనత సమస్య ఉన్నవారు నారింజను తినడం మంచిది.

నారింజలో ఉండే ఫైబర్స్ భోజనం తరువాత పెరిగే బ్లడ్ షుగర్ స్థాయిలను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి.

నారింజలో ఉండే విటమిన్ D-లిమోనేన్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లను నియంత్రిస్తుంది.

నారింజలోని విటమిన్-సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా చలికాలంలో ప్రభలే వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి లభిస్తుంది.

Images Credit: Pixels